CM Jagan on Opposition: మీ పాలనలో పిల్లల గురించి ఆలోచించారా..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ధ్వజం..!
CM Jagan on Opposition: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
CM Jagan on Opposition: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈసందర్భంగా విపక్షాలపై ఫైర్ అయ్యారు. పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు..ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే రోజు రావాలని..పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలన్నారు. అలాంటి రోజు రావాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా బడికి పోవాలన్నారు. బడికి వెళ్తేనే చదువు వచ్చేదని..ఆ బాధ్యతను అక్క చెల్లమ్మలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మన బడి నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మారుస్తున్నామని స్పష్టం చేశారు. పాఠశాలల బాగోగుల కోసమే అమ్మ ఒడిలో కొంత సొమ్ము కేటాయిస్తున్నామని చెప్పారు.
దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారని..ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి బతుకు మార్చాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. ఇందులో భాగంగా అతి పెద్ద ఎడ్యుకేషన్ బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు సీఎం జగన్. ఎంతో ఖర్చు అయిన బైజూస్ చదువును పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పిల్లల చదువుల గురించి ఆలోచించలేదని విమర్శించారు.
మూడేళ్లలో అమ్మ ఒడి కింద రూ.19 వేల 617 కోట్లు, విద్యా దీవెన కింద దాదాపు రూ.8 వేల కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3 వేల 329 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం జగన్. విద్యా దీవెన, వసతి దీవెన కలిపి మూడేళ్లలో మొత్తం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జగనన్న గోరుముద్ద కోసం రూ.3 వేల 200 కోట్లు, విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం రూ.52 వేల 600 కోట్లు కేటాయించామన్నారు.
Also read:Minister KTR on PM Modi: పోరు గడ్డ నుంచి తిరుగుబాటు తప్పదు..మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..!
Also read:Indian Presidential Election-2022: ఉత్కంఠగా రాష్ట్రపతి ఎన్నిక..విపక్షాల అభ్యర్థి నామినేషన్ దాఖలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి