Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తెలంగాణ నుంచే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని..మోదీ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణకు, స్ఫూర్తికి అనుగుణంగా యశ్వంత్ సిన్హా పనిచేస్తారని విశ్వాసంతోనే మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఆయనకు టీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించామని..ప్రత్యేక సమావేశంలో ఆయనకు మద్దతు తెలుపుతామని వెల్లడించారు.
8 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ విరుద్ధంగా ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లు ఉంచుకుని విపక్షాలపై కక్షసాధింపులకు దిగుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము పట్ల వ్యక్తిగతంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
Also read:Flipkart Offers: రూ.7 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే!
Also read:Indian Presidential Election-2022: ఉత్కంఠగా రాష్ట్రపతి ఎన్నిక..విపక్షాల అభ్యర్థి నామినేషన్ దాఖలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి