CM Jagan Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ..మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. ఈమేరకు సీఎం ఢిల్లీ టూర్‌పై సీఎంవో క్లారిటీ ఇచ్చింది. రేపు దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్‌ బయలుదేరుతారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, దావోస్ పర్యటన, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా రోజుల తర్వాత సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈసమయంలో ఆయనతో సీఎం జగన్ భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి ప్రాజెక్టులు, నిధుల విడుదల, పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. 


కేంద్రమంత్రి అమిత్ షా భేటీపై ఇంకా క్లారిటీ రాలేదు. అపాయింట్‌ కోసం సీఎంవో నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సాయంత్రంలోపు క్లారిటీ వస్తుందని సీఎంవో అధికారులు చెబుతున్నారు. గతంలో చాలాసార్లు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదన్న ప్రచారం ఉంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఓ వర్గం విమర్శిస్తోంది.


 


Also read:Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..   


Also read:Ayyannapatrudu Comments: రాష్ట్రం దుర్మార్గుడి చేతిలో ఉంది..అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook