Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..

Sidhu Moose Wala: సిద్ధూ అంత్యక్రియలు పంజాబీ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. సిద్ధూ అవివాహితుడు కావడంతో అంత్యక్రియలకు ముందు పెళ్లి కొడుకులా అలంకరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2022, 08:55 AM IST
  • ముగిసిన సిద్దూ మూసే వాలా అంత్యక్రియలు
  • దుండగుల కాల్పుల్లో మృతి చెందిన సిద్దూ మూసే వాలా
  • హత్య తమ పనే అని ప్రకటించుకున్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్
Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..

Sidhu Moose Wala Last Rites: పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా (28) అంత్యక్రియలు మంగళవారం (మే 31) ముగిశాయి. సిద్ధూ స్వగ్రామం మూసాలో జరిగిన అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. 'మూసేవాలా జిందాబాద్' అంటూ వారంతా నినదించారు. తన పాటలతో చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీని, అభిమానులను సంపాదించుకున్న సిద్ధూ గ్యాంగ్‌ వార్‌లో హత్యకు గురవడం చాలామందిని తీవ్రంగా కలచివేసింది. 

సిద్ధూ అంత్యక్రియలు పంజాబీ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ మేరకు సిద్ధూని పెళ్లి కొడుకులా అలంకరించారు. సిద్ధూ తల్లి అతని తల దువ్వి కొప్పు పెట్టింది. అనంతరం తలకు టర్బన్ చుట్టారు. అదే టర్బన్‌కు సెహ్రా అమర్చారు. సాధారణంగా పెళ్లి రోజు.. వరుడు వధువు ఇంటికి వెళ్లే సమయంలో తలపాగాకు సెహ్రా పెడుతారు. సిద్ధూ అవివాహితుడు కావడంతో పంజాబీ సాంప్రదాయం ప్రకారం ఇలా పెళ్లి కొడుకులా తయారుచేశారు. ఆ సమయంలో సిద్ధూ తండ్రి అతని మీసాలు దిద్దుతూ కనిపించారు. సిద్ధూకి ఇష్టమైన ట్రాక్టర్ ట్రాలీని పూలతో అలంకరించి... అందులోనే అతని అంతిమయాత్ర నిర్వహించారు. 

ఈ ఏడాది చివరలో పెళ్లి : 

ఈ ఏడాది నవంబర్‌లో సిద్ధూ పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం అతని తల్లిదండ్రులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ ఓడిపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు అతని తల్లి చరణ్ కౌర్ వెల్లడించారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్ధూ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటికే సింగర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్ధూ సాంగ్స్ అన్నింటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. సిద్ధూ చివరి సాంగ్ 'ది లాస్ట్ రైడ్.' మరణాన్ని సిద్ధూ ముందే ఊహించి.. ఇలా 'చివరి ప్రయాణం' పేరిట సాంగ్‌ను కంపోజ్ చేశాడా అన్న చర్చ జరుగుతోంది. 

Also Read : TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు పొడగించిన టీఎస్‌పీఎస్సీ... ఎప్పటివరకంటే...  

Also Read: Horoscope Today June 1st 2022: నేటి రాశి ఫలాలు.. గ్రహాల ప్రతికూలతతో ఆ రాశి వారికి అనుకోని కలహాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News