CM Jagan: ఆ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వద్దు..అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం..!
CM Jagan: ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
CM Jagan: బ్యాంకు రుణాలతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వద్దు అని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులన్నీ పూర్త్తైయ్యేలా చూడాలన్నారు. న్యూడెవలప్‌మెంట్, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలన్నారు. నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా ..లేవా..ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి వంటి అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలన్నారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే అక్కడే కొత్త చెరువులు నిర్మించాలని ఆదేశించారు సీఎం జగన్. ఈచెరువులన్నింటినీ కూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలన్నారు.
దీని వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని..పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు సీఎం జగన్. చెరువు కింద చక్కగా భూములు సాగు జరుగుతుందని..వ్యవసాయం బాగుండటంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని చెప్పారు. సమగ్రమైన అధ్యయనం చేసి..ప్రాజెక్టును నిర్మించాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ప్రాజెక్ట్ చేపట్టాలన్నారు సీఎం జగన్.
పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామన్నారు. వీటిచుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి..అక్కడే ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం జగన్. ఇలా చేయడం వల్ల ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం జగన్ అన్నారు.
ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read:Team India: టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..ఇదే..!
Also read:Munugode: మునుగోడు ఉప ఎన్నికలో రెడ్డి వర్సెస్ బీసీ..పంతం ఎవరిదో..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి