CM Jagan: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల 900 కోట్లను ఖర్చుచేసిందని..వీటిని వెంటనే రియింబర్స్‌ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విన్నవించారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్ట్ వ్యంయ రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. డీబీటీ పద్దతి ద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలన్నారు. రిసోర్స్ గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.32 వేల 625.25 కోట్లు మంజూరు చేయాలని ప్రధానికి వినతిపత్రం అందజేశారు. 


2014-15 కాలానికి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్దీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ ద్వారా రేషన్‌ అందుతోందని ఈసందర్భంగా ప్రధానికి వివరించారు. ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న రాష్ట్రాల కంటే ఏపీలో అధిక లబ్ధిదారులు ఉన్నారని..కావున రాష్ట్రాన్ని కేటాయింపులను పరిశీలించాలన్నారు.


కోవిడ్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే..అదనంగా 56 లక్షల కుటుంబాలకు రేషన్ అందిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పరిశీలించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. భేటీలో తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని సీఎం ప్రస్తావించారు.


రూ.6 వేల 756 కోట్లు బకాయిలు ఉన్నాయని..8 ఏళ్లుగా అంశం పరిష్కారం కావడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారం ఐతే విద్యుత్ కంపెనీలకు మేలు జరుగుతుందన్నారు. విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీకి విన్నవించారు. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను ఆచరణలో పెట్టాలన్నారు. ఏపీలో 26 జిల్లాలకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని..కొత్తగా మూడు కాలేజీలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. 


ఇంకా 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉందని..వీటిని మంజూరు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కడపలో ఇంటిగ్రేడెట్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకమని..ఖనిజ రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత అవరసమని ప్రధానికి వివరించారు. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలన్నారు.


[[{"fid":"242400","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


Also read:Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని


Also read:Virat Kohli: మరో ఐదు రోజుల్లో ఆసియా కప్..కోహ్లీ ఫామ్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి