Allu Arjun Bail: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 3, 2025, 05:33 PM IST
Allu Arjun Bail: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

Allu Arjun Bail: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రెగ్యులర్‌ బెయిల్‌ రావడంతో అల్లు అర్జున్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లు అర్జున్‌కు కస్టడీ విధించాలని వాదించగా కోర్టు బన్నీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. రూ.50 వేలు రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మధ్యంతర బెయిల్‌ పొందిన అల్లు అర్జున్‌ ఒకరోజు రాత్రి జైలులో ఉండి వచ్చారు.

నాడు నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు వెళ్లగా తాజాగా అదే న్యాయస్థానం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. కొన్ని రోజుల కిందట జరిగిన విచారణలో అల్లు అర్జున్‌ విచారణకు వర్చువల్‌గా హాజరయ్యాడు. ఆ రోజు అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు శుక్రవారం బెయిల్‌ ఇస్తూ తీర్పునిచ్చింది. కాగా గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ మంజూరుతో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. త్వరలోనే హైకోర్టు కూడా రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసే అవకాశం ఉంది.

అయితే బన్నీకి బెయిల్‌ మంజూరు కావడంతో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరుతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జైలుకు వెళ్తాడేమో అనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విచారణ కొనసాగనుండగా.. అల్లు అర్జున్‌ ఇక జైలుకు వెళ్లరని అభిమానులు భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News