Jamili Elections: జమిలికి సిద్ధమౌతున్న చంద్రబాబు, వేగంగా నిర్ణయాలు రాజధాని పనులు ప్రారంభం
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా అంటే ఆ దిశగానే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే సిద్ధమయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఇదే చర్చ జరిగింది. కూటమిలోని పార్టీలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలనే సూచనలు జారీ అయ్యాయి. అందుకే ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జమిలి ఎన్నికలే వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు.
దేశంలో జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమౌతున్నట్టు తెలుస్తోంది. పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అమరావతిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాంతాన్ని క్లీన్ చేసే పని చేపట్టారు. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తయింది. ఇక ఈ ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల్ని పూర్తి చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణం ఆమోదం దాదాపుగా లభించింది.
అమరావతిలో నిర్మాణాల కోసం టెంర్లు ఖరారు చేయడానికి ముందే కన్సల్టెంట్లను నియమించనుంది. ఇవాళ రాజధాని నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. లింగాయపాలెం వద్ద సీఆర్డీఏ బిల్డింగ్ పనుల్ని ప్రారంభించారు. సీఆర్డీఏ కార్యాలయం ఇంటీరియర్ పనుల్ని 160 కోట్ల రూపాయలతో ఫ్రారంభించారు. మరోవైపు 49 వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణపు తొలి దశ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలోనే అమరావతి నిర్మాణం కోసం నిధుల్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే విధంగా రాజధాని నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులకు ఈ నెలలోనే ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జమిలి ఎన్నికలు వస్తే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేందుకు అటు సంక్షేమ కార్యక్రమాల్ని కూడా పూర్తిగా అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also read: Tirumala Darshanam Letters: ఎమ్మెల్యేలకు గుడ్‌న్యూస్, తిరుమల దర్శనం లేఖల కోటా పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.