AP Cabinet Expansion: ఏపీలో కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ విస్తరణపై మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని తేల్చేశారు. కేబినెట్ నుంచి కొందరు మంత్రులను తప్పించనున్నట్లు తెలిపారు. మంత్రి పదవులు కోల్పోయినంత మాత్రాన.. వారిని పక్కన పెట్టినట్లు కాదని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని.. వారికి జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి పదవులు కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందవద్దని.. మళ్లీ గెలిచొస్తే మీరే మంత్రులు అవుతారని జగన్ పేర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది పోటీలో ఉన్నారని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గంలో తమకు చోటు ఉంటుందా.. ఉండదా అని పలువురు మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఏ అంశాల ప్రాతిపదికన జగన్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. 


2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడే మంత్రివర్గ విస్తరణపై జగన్ క్లారిటీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో 90 శాతం మార్పులు చేర్పులు ఉంటాయని వెల్లడించారు. సీఎం చేసిన ప్రకటనను బట్టి గతేడాదే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేయడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 15న జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై మరింత క్లారిటీ రావొచ్చునని చెబుతున్నారు. ఏడుగురు మంత్రులను మినహాయించి మిగతా మంత్రివర్గాన్ని మార్చే అవకాశం ఉందంటున్నారు.


Also Read: Bank Scam: జగిత్యాల యూనియన్ బ్యాంకులో వెలుగుచూసిన స్కామ్... భారీగా నగదు కాజేసిన మేనేజర్..


Also Read: CM KCR Health Update: కేసీఆర్ హెల్త్‌పై యశోద వైద్యుల ప్రెస్ మీట్.. సీఎం ఆరోగ్యంపై ఏం చెప్పారంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook