CM KCR Health Update: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సర్వికల్ స్పాండిలైటిస్ వల్లే సీఎం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. కరోనరీ యాంజియోగ్రామ్ టెస్టుల్లో ఎలాంటి బ్లాక్స్ లేవని వెల్లడైందన్నారు. గుండెకు సంబంధించి అంతా బాగానే ఉందన్నారు. సీఎంకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటివరకూ 90 శాతం రిపోర్టులు వచ్చాయని తెలిపారు. అన్నింటిలోనూ నార్మల్‌గానే ఉన్నట్లు తేలిందన్నారు. బీపీ, సుగర్ నియంత్రణలోనే ఉందని.. మెదడు, లివర్, కిడ్నీ పనితీరు బాగుందన్నారు.
ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కొంత నీరసానికి గురయ్యారని... వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించినట్లు యశోద వైద్యులు వెల్లడించారు. ఇప్పటినుంచి ప్రతీ వారం సీఎం కేసీఆర్‌కు గ్లూకోజు రక్త పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ డే కేర్ అడ్మిషన్ తీసుకున్నారని.. సాయంత్రం 3 గంటలకు ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని తెలిపారు.
ఎడమ చేతి వైపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఈ ఉదయం సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి వైద్య పరీక్షలు చేశామన్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ప్రివెంటివ్ చెకప్ కోసం ఆసుపత్రికి రమ్మన్నామని తెలిపారు. సీఎం ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని.. ఆయన కళ్లు తిరిగి పడిపోయారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Also Read: CM KCR Hospitalised: యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం క్షేమంగా ఉండాలన్న బండి సంజయ్...
Also Read: Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు.. వ్యక్తిగత డాక్టర్ ఏం చెప్పారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook