AP Cabinet Reshuffle: ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారు..?
AP Cabinet Reshuffle: చాలాకాలంగా అదిగో.. ఇదిగో.. అంటూ ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సాగుతున్న ప్రచారానికి ఇక తెరపడనుందా.. కేబినెట్ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేశారా..?
AP Cabinet Reshuffle: ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గతేడాది నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో.. ఇదిగో... అంటూ ప్రచారం జరిగినప్పటికీ సీఎం జగన్ మాత్రం అదే కేబినెట్‌ను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమనే వాదన వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు.
బహుశా వచ్చే జూన్‌లో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చునని తెలుస్తోంది. రాష్ట్రంలో కేబినెట్ కొలువుదీరి జూన్ 8 నాటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చునని చెబుతున్నారు. అలాగే, కొత్త కేబినెట్ కొలువుదీరకముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉండొచ్చునని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి తెర పైకి రావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం లేకపోలేదు.
నిజానికి రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యాక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ మొదట్లోనే చెప్పారు. కానీ కొన్ని కారణాలతో ఇప్పటివరకూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టలేదు. అయితే మంత్రుల పనితీరుకు సంబంధించి గతేడాది జగన్ నివేదికలు తెప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. నివేదికల ఆధారంగానే కేబినెట్‌లో మార్పులు చేర్పులపై సీఎం నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ వినిపించింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సీఎం సిద్ధమవుతుండటంతో.. మంత్రుల పనితీరుపై మరోసారి నివేదికలు తెప్పించుకునే అవకాశం లేకపోలేదు. ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని పంపించాలనే దానిపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి రావొచ్చు.
Also Read: Horoscope Today 13th FEB 2022: నేటి రాశిఫలాలు.. వ్యాపారంలో పెట్టుబడి ఈ రాశుల వారు జాగ్రత్త ఉండాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook