CM JAGAN:సీఎం జగన్ పెన్ను తీసుకున్న చిన్నారి... ఆ పెన్ను ఖరీదు 70 వేలకు ఎక్కువే!
CM JAGAN: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముంపు భారీగా పడిన గ్రామాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలోనే సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు.
CM JAGAN: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముంపు భారీగా పడిన గ్రామాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని సుమారు 51 లంక గ్రామాలు వారం రోజులుగా వరదలో ఉన్నాయి. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలోనే సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంపు గ్రామాలను పరిశీలించిన సీఎం జగన్.. వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామి ఇచ్చి వాళ్లలో భరోసా నింపారు.
వరద ప్రభావిత ప్రాంతమైన పుచ్చకాయలవారి పేటలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్.. వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. అయితే జగన్ ఎత్తుకున్న చిన్నారి.. సీఎం జేబులో ఉన్న పెన్ను తీసుకుంది. జగన్ జేబులోని ఆ పెన్ను ఖరీదు 70 వేల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చిన్నారి పెన్ను తీసుకోవడంతో... ఆ పెన్నును చిన్నారికే ఇచ్చేశారు సీఎం జగన్.
కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా మొదట అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడ్రేవు పల్లిలోని వరద ముంపు గ్రామాలను పరిశీలించారు సీఎం జగన్. బాధితులతో సమావేశమయ్యారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించి.. తాజా పరిస్థితులను అంచనా వేశారు. మధ్యాహ్నం రాజోలు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. మేకలపాలెంలో వరద బాధితులతో సమావేశమయ్యారు.వాడ్రేవుపల్లిని పరిశీలించారు సీఎం జగన్. అక్కడినుంచి రాజోలు మండలం మేకలపాలెం వెళ్లారు. అక్కడి వరద బాధితులను పరామర్శించనున్నారు.అంతకుముందు పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను కలిసి పరామర్శించారు సీఎం జగన్. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అందిన సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సాయంత్రం సీఎం జగన్ రాజమండ్రి చేరుకొని.. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద సమయంలో తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. బుధవారం కూడా వరద ముంపు గ్రామాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.