Congress Leader YS Sharmila Fires On AP CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత సీఎం జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్  ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కూడా జగన్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ.. సీఎం జగన్ దిగజారీ ప్రవర్తిస్తున్నారని,  సాక్షిలో తన గురించి వ్యక్తి గత దూషణలు చేయడం పై స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాక్షిలో తనకు సమాన వాటా ఉందని అన్నారు. తాను ఏపీ కి రావాల్సిన ఫలాల గురించి పోట్లాడుతున్నానని, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాని అన్నారు. పోలవరం ఎందుకు పూర్తికాలేదు.. బీజేపీకి మీరు బానిసలాగా ఎందుకున్నారు..?.. రాజధాని గురించి, బిడ్డలకు ఉద్యోగాలు, రైతులకు క్రాప్ ఇన్సురెన్స్ గురించి ప్రశ్నిస్తుంటే.. మీరు మాత్రం సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన దూషణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


విలువలు, విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైఎస్సార్సీ పీ ఇప్పుడు ఇంతలా దిగజారాలా అని ఎద్దెవా చేశారు. తాను రాజశేఖర్ బిడ్డనని, తన ఒంట్లో రాజశేఖరుడి రక్తం ప్రవహిస్తుందని షర్మిల అన్నారు. ఎవరు అరిచి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేసి ఆంధ్ర ప్రదేశ్ కోసం ఎంత వరకైన కోట్లాడటానికి తాను సిద్ధమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook