AP Corona cases: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ ప్రభావం - 3 వేల దిగువకు కొత్త కేసులు!
AP Corona cases: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 3 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,690 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది.
శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 28,598 టెస్టులు చేయగా ఈ కేసులు బయటపడ్డట్లు పేర్కొంది.
రికవరీలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులో 11,855 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు మొత్తం 2,219,219 మంది కరోనాను జయించారు.
రాష్ట్రంలో ఇంకా 69,572 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది ఆరోగ్య విభాగం.
మరణాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం మీద రాష్ట్రంలో 14,664 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ డేటాలో వెల్లడైంది.
అత్యధిక కేసులు ఆ జిల్లాల్లోనే..
తూర్పు గోదావరిలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలోనే 518 కేలులు నమోదయ్యాయి. గుంటూరులో 354, కృష్ణాలో 352, వైజాగ్ 198, కడప 181, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
యాక్టివ్ కేసుల ప్రకాశం మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో మొత్తం 13,958 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. విజయనగరంలో అత్యల్పంగా 824 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also read: Ap cm ys jagan: మీరు లేకపోతే నేను లేనంటూ సీఎం జగన్ భావోద్వేగం
Also read: AP PRC Issue: చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన కొత్త అంశాలు, వ్యత్యాసమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook