Kondapalli Municipality Election: అందరి దృష్టిని ఆకర్షించిన కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. గత రెండు రోజులుగా వాయిదా పడిన ఎన్నికను హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైకాపా సభ్యులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికకు మందు వార్డు సభ్యులతో ఆర్వో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నిక వివరాలను ఎస్‌ఈసీ హైకోర్టుకు అందజేయనున్నారు. ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాల మేరకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన వారి పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలిరోజు (సోమవారం) నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు (మంగళవారం)కు వాయిదా పడిన ఛైర్మన్‌ ఎన్నిక నిన్న కూడా వాయిదా వేశారు. తెదేపా ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫీషియో ఓటు చెల్లదంటూ వైకాపా సభ్యులు నిన్న ఎన్నికలో పాల్గొనలేదు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నిక హాలు నుంచి బయటికి వచ్చారు.


అంతకముందు తెదేపా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరపాలని హైకోర్టులో నిన్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ ఎన్నిక నిర్వహించాలని.. ఫలితాన్ని వెల్లడించవద్దని ఆదేశించింది. ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగం ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 


Also Read: వరద నష్టంపై ప్రధాని మోదీ, అమిత్ షాలకు వైఎస్ జగన్ లేఖ, వేయి కోట్ల సాయం కోసం విజ్ఞప్తి


Also Read: ఉల్లి కాదు కన్నీరు తెప్పించేది టొమాటోనే, ఆకాశాన్ని తాకుతున్న ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook