ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు కార్తీక మాసం ప్రభావంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టొమాటో పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ముట్టుకుంటేనే వణుకుపుడుతోంది. ఏపీలో టొమాటో ధర బెంబేలెత్తిస్తోంది.
ఇంధన ధరలే కాదు నిత్యావసర వస్తు ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు మారిపోతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలతో ఉన్న పంట కాస్తా నాశనమైతే..మరోవైపు కార్తీక మాసం డిమాండ్ నేపధ్యంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ కూరగాయలు (Vegetable Prices)తీసుకున్నా కిలో 50-60 రూపాయలకు పైమాటే ఉంటోంది. ముఖ్యంగా టొమాటో ధరైతే (Tomato Price)మరీ ఘోరంగా మారింది. కిలో టొమాటో ఒకప్పుడు రూపాయికి అమ్మిన పరిస్థితి, వృధాగా రోడ్డుపై పడేసిన దుస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా 150 రూపాయలకు చేరిన పరిస్థితి. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో కిలో టొమాటో(Tomato Price) ఏకంగా 130 రూపాయలు పలుకుతోంది. టొమాటోకు మదనపల్లె మార్కెట్ సుప్రసిద్ధి. అటు హైదరాబాద్ మార్కెట్‌లో సైతం కిలో టొమాటో 120-130 రూపాయలు మధ్య ఉంటోంది. ఇక చెన్నై పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది.
చెన్నైలో కిలో టొమాటో ఏకంగా 150 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో కిలో టొమాటోలకు(Chennai Tomato Price) బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించడం పరిస్థితి తీవ్రతు అద్దం పడుతోంది. టొమాటో ధరలు పెట్రోల్ ధరల్ని దాటడం సామాన్యుడికి కంటతడి పట్టిస్తోంది. చెన్నై, మదనపల్లె మార్కెట్‌లలో టొమాటో ధరలు(Madanapalle Tomato Price)పెరగడానికి కారణం గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలేనని తెలుస్తోంది. ప్రతి కూరగాయల్లోనూ టొమాటో తప్పనిసరిగా వాడుతుండటంతో ఎంత ధరైనా కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరులో టొమాటో సాగు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు టొమాటో పంట ఘోరంగా దెబ్బతినడంతో దిగుబడి తగ్గి ధర విపరీతంగా పెరిగిపోయింది.
Also read: SCR: భారీ వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లు...పలు రైళ్లు రద్దు..6 రైళ్లు పనురుద్ధరణ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook