Farmer Loan Waiver: రుణ మాఫీ, పెన్షన్ పెంపుతో జగన్ ఎన్నికల గేమ్ చేంజ్ చేయనున్నారా
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Farmer Loan Waiver: ఏపీ ఎన్నికల వేళ వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎకంగా రుణమాఫీ ప్రకటించవచ్చని సమాచారం.
ఏపీలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్ధుల్ని సమూలంగా మార్చుతూ జాబితాలు విడుదల చేస్తూ ప్రచారం ప్రారంభించేసింది. అటు తెలుగుదేశం-జనసేన పార్టీలు మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటులోనే మునిగి ఉన్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని ప్రకటించిన వైఎస్ జగన్ సిద్ధం పేరుతో మూడు బారీ బహిరంగ సభల్ని నిర్వహించారు. వైనాట్ 175 లక్ష్యంతో ముందుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని వైఎస్ జగన్ 99 శాతం పూర్తి చేశారనేది అందరికీ తెలిసిందే. అంటే ప్రజల్లో జగన్ హామీలపై లేదా పార్టీ మేనిఫెస్టోపై నమ్మకం కలిగింది. రాష్ట్రంలో 2.54 లక్షల విలువైన పధకాల్ని అందించారు. 2014లో ఒత్తిడి వచ్చినా సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో ఆనాడు జగన్ రుణమాఫీ ప్రకటించలేదు. కానీ చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చినా సరిగ్గా అమలు చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశా అందుకే తెలుగుదేశం సంక్షేమ పథకాలను ప్రకటించినా ప్రజల్లో అంతగా ఆదరణ కన్పించలేదు. కానీ జగన్ విషయంలో చెప్పింది చేస్తాడనే నమ్మకం ఉందనేది పార్టీ అభిప్రాయం.
అందుకే ఈసారి రుణమాఫీ ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే 78 లక్షలమంది రైతులకు ప్రయోజనం అందింది. ఇప్పుడీ సమయంలో జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తే గేమ్ ఛేంజర్ కావచ్చని అంచనా. మరోవైపు జగన్ అధికారంలో వచ్చే సమయానికి 2 వేలున్నపెన్షన్ ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు 3 వేలుగా మారింది. ఇప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా 4 వేలకు పెంచవచ్చని భావిస్తున్నారు. నిజంగా ఈ రెండు జరిగితే కచ్చితంగా ప్రతిపక్షాలకు జీర్ణించుకోలేని అంశంగా మారవచ్చు.
Also read: AP Elections 2024: పోల్ మేనేజ్‌మెంట్‌లో జగన్ లెక్కే వేరు, మరో కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook