AP Lok Sabha Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అనూహ్య విజయాలు.. లోక్ సభ, అసెంబ్లీలో పెరిగిన సీట్లు..
AP Lok Sabha Elections 2024: అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనత పార్టీకి ఉత్తరాది ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. కానీ అదే సమయంలో దక్షిణాదిలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మంచి సీట్లనే కట్టబెట్టారు. అంతేకాదు ఏపీలో కూటమితో కలిసి బరిలో దిగిన బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయి.
AP Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా బీజేపీకి గుండె కాయ వంటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అక్కడి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. 500 యేళ్లుగా ఎదురు చూసిన రామ మందిర నిర్మాణం వంటి అంశాలు అక్కడ పనిచేయలేదనే చెప్పాలి. దాంతో పాటు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. వాళ్లు కోరుకున్న సగం మెజారిటీ స్థానాలకు దగ్గరలోనే ఆగిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేసిన 6 స్థానాల్లో 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యంగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్ .. దాదాపు 66వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నుంచి సమపీ వైసీపీ అభ్యర్ధి గూడురి శ్రీనివాస్ పై దాదాపు 1 లక్షా 75 వేల ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు నర్సాపురం స్థానంలో భూపతిరాజు శ్రీనవాస వర్మ తన సమీప వైసీపీ అభ్యర్ధి గూడురి ఉమాబాలపై దాదాపు 1 లక్ష 50 వేల మెజారిటీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు విజయం దాదాపు ఖాయమనే చెప్పాలి. మొత్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మంచి సీట్లే ఇచ్చారు.
అటు ఏపీ అసెంబ్లీలో బీజేపీకి 7 సీట్లలో లీడ్లో కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ దాదాపు 8 సీట్లలో లీడ్ లో కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్ గిరి స్థానాల్లో లీడ్ లో ఉంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఉత్తరాదిలో డీలా పడ్డా బీజేపీకి తెలుగు రాష్ట్రాల నుంచి మంచి సీట్లు రావడంతో చెప్పుకోదగ్గు పరిణామం అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook