Anaparthi Seat: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో ఉంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అనపర్తి స్థానాన్ని తొలుత ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ బేజేపీ చేరికతో ఆ స్థానాన్ని వదులుకుంది. అంతే ఒక్కసారిగా అసంతృప్తి రాజుకుంది. చంద్రబాబు చెప్పినా వినేది లేదంటున్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం జనసేన తొలిసారిగా ప్రకటించిన జాబితాలో అనపర్తి స్థానాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించారు. కానీ తరువాత కూటమిలో చేరిన బీజేపీ రాజమండ్రి అర్బన్ స్థానాన్ని కోరింది. కానీ ఈ స్థానంలో ఎర్రన్నాయుడు అల్లుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కేటాయించడంతో చంద్రబాబు అనపర్తి స్థానాన్ని బీజేపీకి ఇచ్చేశారు. తనతో కనీసం సంప్రదించకుండా సీటు మార్చడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ పెద్దలు ఎంత చెప్పినా ససేమిరా అంటున్నారు. రెడ్ల ఆధిపత్యం కలిగిన నియోజకవర్గంలో రాజులకు అందులోనూ బలం లేని బీజేపీకు సీటు కేటాయించడాన్ని టీడీపీ కార్తకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 


ఈ ప్రభావం కాస్తా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పురంధరేశ్వరిపై పడనుంది. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ స్థానం గెలుపోటములు ఎప్పుడూ అనపర్తి మెజార్టీపైనే ఆధారపడి ఉంటోంది. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట వినకపోవడంతో బీజేపీ అభ్యర్దికి కష్టమని తేలిపోయింది. అనపర్తిలో పరిస్థితి మొదటికి మోసం తెస్తుందని గ్రహించిన టీడీపీ అదినేత చంద్రబాబు ఈ విషయంలో పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 


కొవ్వూరులో ఇవాళ జరిగిన ప్రజాగళం యాత్రలో అనపర్తి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకు అనపర్తిని కేటాయించినా ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదని చంద్రబాబు తెలిపారు. అనపర్తిని తిరిగి టీడీపీకే కేటాయించి ఆ స్థానంలో బీజేపీకు మరో నియోజకవర్గం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఇలా హింట్ ఇచ్చారని అంటున్నారు. 


Also read: New Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook