AP Poll Percentage 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది. 17ఏ రిజిస్టర్‌తో సరిచూసిన తరువాత తుది పోలింగ్ శాతాన్ని నిన్న అర్ధరాత్రి విడుదల చేసింది. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరి కొంపముంచుతుందో తెలియడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ శాతం వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 80.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1 శాతం కలుపుకుంటే మొత్తం 81.76 శాతమైంది. 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం కంటే దాదాపు 2 శాతం ఎక్కువ. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌పై రాజకీయ పార్టీలు దేనికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు విపక్ష కూటమిలోని జనసేన-బీజేపీ-టీడీపీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ శాతం పెరగడమంటే అధికార పార్టీకు వ్యతిరేకమనే సంకేతాలుంటాయి. కానీ ఈసారి ఓటరు నాడి బయటపడలేదు. అధికార పార్టీకు పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. అందుకే ఈ పరిణామం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరిని ముంచుతుందనేది తెలియడం లేదు. 


చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం నమోదు కాగా, విశాఖపట్నంలో అత్యల్పంగా 68.63 శాతం నమోదైంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం పోలింగ్ నమోదు కాగా, విశాఖపట్నంలో 71.11 శాతం నమోదైంది. 


Also read: AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook