TDP-Janasena List: ఇవాళే తెలుగుదేశం-జననసే తొలి జాబితా, ఎంతమంది, ఎవరెవరు
TDP-Janasena List: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎట్టకేలకు తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు సర్దుబాట్లు పూర్తి చేసుకున్నట్టు కన్పిస్తోంది. ఇవాళ రెండు పార్టీలు ఉమ్మడి జాబితా విడుదల చేయవచ్చని సమాచారం.
TDP-Janasena List: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంలో ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో బీజేపీ చేరిక దాదాపుగా ఖాయమైంది. బీజేపీ చేరికపై స్పష్టత రాకపోవడంతో తెలుగుదేశం-జనసేనలు మొదటి విడత జాబితా విడుదల చేయనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకూ సీట్ల సర్దుబాటులోనే మునిగి ఉన్న తెలుగుదేశం ఎట్టకేలకు మొదటి జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 7 జాబితాలు వెలువరించి ప్రచారంలో ముందంజలో ఉంది. అన్ని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ప్రకటిస్తుండటంతో ప్రతిపక్షాలకు జాబితా సిద్ధం చేయడం కష్టమౌతోంది. అదే సమయంలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవల్సి ఉంటుంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన రెండు పార్టీలు సీట్ల విషయంల ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇవాళ ఉదయం 11.40 గంటలకు తెలుగుదేశం-జనసేనలు కలిపి ఉమ్మడి జాబితా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు కార్యాలయానికి రావల్సిందిగా పిలుపు అందినట్టు సమాచారం.
బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన విడుదల కాకపోవడంతో ఇబ్బంది లేని సీట్లను తెలుగుదేశం-జనసేనలు విడుదల చేయవచ్చని సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ 50 మందిని, జనసేన 10 మందిని ప్రకటించవచ్చని సమాచారం. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకున్నా రెండు పార్టీల కలిసి తొలి జాబితా విడుదల చేయవచ్చనేది దాదాపుగా ఖాయమైంది.
Also read: Pawan kalyan Comments: వయసు మళ్లిన నేతలు తప్పుకోవాలన్న పవన్ వ్యాఖ్యల వెనుక కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook