AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినా స్థానాల విషయంలో పేచీ ఏర్పడింది. ఈ పంచాయితీకి రాజీమార్గంగా బీజేపీ అదనంగా మరో స్థానాన్ని దక్కించుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగుతోంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. సీట్ల సర్దుబాటైతే జరిగింది కానీ ఏయే స్థానాలనే విషయంలో మూడు పార్టీల మద్య పేచీ నడుస్తోంది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత కల్పించే విషయమై కోరుకున్న స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టింది. 


కొందరి పేర్లు బయటకు రావడంతో తెలుగుదేశం మద్దతుదారులుగా గుర్తింపు ఉన్నవారికి సీట్లు కేటాయించడమేంటని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి సమాచారమందించారు. ఓడిపోయే స్థానాల్ని తమకిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. దాంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని ఢిల్లీకి పిలిపించిన బీజేపీ అధిష్టానం మరో అసెంబ్లీ స్థానం పెంచాల్సిందిగా కోరమని ఆదేశించింది. బీజేపీ పోటీ చేసే లోక్‌సభ స్థానాల విషయంలో క్లారిటీ వచ్చేసింది. విజయనగరం, అరకు, అనకాపల్లి, నర్శాపురం, రాజమండ్రి, తిరుపతి నియోజకవర్గాలు ఖరారయ్యాయి. ఇక అసెంబ్లీ విషయంలో పాడేరు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, ఆదోని, జమ్మలమడుగు, ధర్మవరం స్థానాల పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు అదనంగా కాకినాడ అసెంబ్లీ ఖరారైనట్టు సమాచారం.


రాజమండ్రి పార్లమెంట్ నుంచి పురంధరేశ్వరి, అరకు నుంచి కొత్తపల్లి గీత, నర్శాపురం నుంచి నరేంద్ర వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేర్లు విన్పిస్తున్నాయి. ఇక అనకాపల్లి నుంచి సీఎం రమేష్, జీవీఎల్, మాధవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 


Also read: DMK Election Manifesto: టోల్ గేట్ల రద్దు, లీటర్ పెట్రోల్ 75 రూపాయలే, డీఎంకే మేనిఫెస్టో విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook