Telugudesam 2nd List: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 94 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేయగా ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. తెలుగుదేశం మిత్రపక్షం జనసేన సైతం 9 మంది అభ్యర్ధులతో రెండో జాబితా ఇవాళే విడుదల చేసింది. టీడీపీ విడుదల చేసిన 34 మందిలో 27 మంది పురుషులు కాగా, 7గురు మహిళా అభ్యర్ధులున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం రెండో జాబితా


నరసన్నపేట- బొగ్గు రమణమూర్తి
గాజువాక-పల్లా శ్రీనివాసరావు
చోడవరం-కేఎస్ఎన్ఎస్ రాజు
మాడుగుల-పైలాప్రసాద్
ప్రత్తిపాడు-వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం-వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం-మిర్యాల శిరీష
కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు-చింతమనేని ప్రభాకర్
గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు-భాష్యం ప్రవీణ్
గుంటూరు ఈస్ట్-మొహమ్మద్ నజీర్
గురజాల-యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు-ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం-కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు-అశోక్ రెడ్డి
ఆత్మకూరు-ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు-వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి-కురుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం-పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు-వరదరాజులు రెడ్డి
నందికొట్కూరు(ఎస్సీ)-గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు-జయ నాగేశ్వరరెడ్డి
మంత్రాలయం-రాఘవేంద్రరెడ్డి
పుట్టపర్తి-పల్లె సింధూరారెడ్డి
కదిరి-కందికుంట యశోదా దేవి
మదనపల్లె-షాజహాన్ బాషా
పుంగనూరు-చల్లా రామచంద్రారెడ్డి
చంద్రగిరి-పులివర్తి వెంకట మణిప్రసాద్
శ్రీకాళహస్తి-బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు(ఎస్సీ)-కోనేటి ఆదిమూలం
పూతలపట్టు( ఎస్సీ) డాక్టర్ కలికిరి మురళీమోహన్


రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనుంది. ఇక జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం ఇప్పటికే తొలి జాబితాలో 94, రెండో జాబితాలో ఇవాళ 34 మందిని ప్రకటించింది. ఇంకా 16 మంది అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. 


Also read: Janasena 2nd List: మరో 9 మందితో జనసేన రెండో జాబితా విడుదల, పవన్ పోటీపై ఇంకా సందిగ్దత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook