Congress 9 Guarantees: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రంగంలో దిగిన వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్‌పై, జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. మరో రెండ్రోజుల్లో అభ్యర్దుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల దరఖాస్తులు వచ్చినట్టు వైఎస్ షర్మిల తెలిపారు. అభ్యర్దుల జాబితాపై చర్చించేందుకు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. అభ్యర్ది పనితనం ఆధారంగా సర్వే చేయించి టికెట్ కేటాయిస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 9 ఎన్నికల గ్యారంటీలను ప్రకటించారు. 


1. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 10 ఏళ్లు ప్రత్యేక హోదాపై సంతకం
2. రైతులకు 2 లక్షల వరకూ రుణమాఫీ
3. ప్రతి పేద మహిళకు నెలకు 8500 రూపాయలు, ఏడాది లక్ష రూపాయలు
4. రైతాంగానికి పెట్టుబడిపై 50 శాత లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కింద కూలీలలకు కనీస వేతనం 400 రూపాయలు
6. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య
7. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి మహిళ పేరుపై 5 లక్షలతో పక్కా ఇళ్లు
9. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్, వృద్ధులకు 4 వేలు, వికలాంగులకు 6 వేల పెన్షన్


Also read: YCP New Strategy: ప్రత్యర్ధి పార్టీల రెబెల్స్‌పై గురి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook