YCP New Strategy: ప్రత్యర్ధి పార్టీల రెబెల్స్‌పై గురి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

YCP New Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం పూర్తిగా రాజుకుంటోంది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్ధుల ఎంపిక ఖరారు కావడంతో ఇక ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2024, 02:32 PM IST
YCP New Strategy: ప్రత్యర్ధి పార్టీల రెబెల్స్‌పై గురి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

YCP New Strategy: ఏపీలో తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో నిలిచింది. కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలో సహజంగానే కూటమిలో అసంతృప్తులు అధికమయ్యాయి.

ఏపీలో మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం పన్నుతోంది. తెలుగుదేశం-జనసేన పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల్ని టార్గెట్ చేస్తోంది. ముమ్మిడివరం నుంచి జనసేన నేత పితాని బాలకృష్ణ, విజయవాడ వెస్ట్ నుంచి మహేశ్ తదితురులున్నారు. ఇక అనపర్తి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తాడేపల్లి గూడెం నుంచి ఈలి నాని ఉన్నారు. ఇలా జనసేన-తెలుగుదేశం నుంచి అసంతృప్తుల సంఖ్య భారీగానే ఉంది. దాదాపు 30 మంది ఉండవచ్చని అంచనా. ఈ అభ్యర్ధులందరూ బరిలో ఉంటే కనీసం 10 వేల ఓట్లు చీల్చవచ్చని ఐప్యాక్ సర్వేలో తేలింది. 

అందుకే ఈ అసంతృప్తుల్ని పార్టీలో చేర్చుకోకుండా రెబెల్స్‌గా ప్రోత్సహించే ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. అంటే ఈ రెబెల్స్ అందరికీ ఆర్ధిక సహకారం అందించడం ద్వారా ఓట్లు బలంగా చీల్చే వ్యూహం పన్నుతోంది. తెలుగుదేశం నుంచి కనీసం 10 మంది రెబెల్స్ పోటీలో ఉండేట్టు వైసీపీ ప్లాన్ చేస్తోంది. అవసరమైన ఆర్దిక సహకారం అందించేందుకు సిద్దమౌతోంది. కోట్లు ఖర్చుపెట్టైనా ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం కూటమికి అధికార పార్టీకు మధ్య పోటీ గట్టిగా ఉంది. ఈ క్రమంలో ఎన్ని ఓట్లు చీల్చగలిగితే అధికార పార్టీకు అంత ప్రయోజనం. అందుకే జనసేన, టీడీపీలోని రెబెల్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 

Also read: Janasena: మచిలీపట్నం నుంచి బాలశౌరి, వంగవీటి రాధాకృష్ణకు అవకాశం లేనట్టేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News