Ap Elections 2024: త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన ఇప్పటికే కూటమిగా ఏర్పడగా ఇక బీజేపీ చేరిక ఖాయమైంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో పొత్తుపై సంయుక్త ప్రకటన విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం-బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన పోటీ చేయకపోయినా ప్రత్యక్షంగా మద్దతిచ్చింది. ఆ తరువాత 2018లో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటికొచ్చేసింది. జనసేన కూడా బీజేపీతో స్నేహం వదులుకుని వామపక్షాలతో, తరువాత బీఎస్పీతో జత చేరింది. ఆా తరువాత తిరిగి బీజేపీకు దగ్గరైంది. ఇటీవల రెండేళ్లుగా తెలుగుదేశంతో కలిసి జనసేన ప్రయాణిస్తోంది. ఇటీవలే తెలుగుదేశం-జనసేన పొత్తు ఖరారైంది. ఇప్పుడు తాజాగా బీజేపీతో పొత్తు ఖరారైంది. అయితే ఎవరికెన్ని సీట్లనేది ఇంకా స్పష్టత రాలేదు. 


తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయమైనప్పుడు జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. ఇవాళ బీజేపీతో పొత్తు ఖరారైన తరువాత బీజేపీకు 6 పార్లమెంట్, జనసేనకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించవచ్చని తెలుస్తోంది. అంటే జనసేనకు ఇప్పటికే కేటాయించిన 3 స్థానాల్నించి ఒకటి తగ్గిపోనుంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే జనసేనకు 24 స్థానాలుగా ప్రకటించిన పరిస్థితి తెలిసిందే. కానీ ఇవాళ ఢిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ-జనసేనకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలిస్తున్నట్టు తేలింది. అంటే బీజేపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంటుందా లేక జనసేన మరి కొన్ని స్థానాల్ని వదులుకుంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 


Also read: Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook