Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?

TDP BJP Janasena Alliance: ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి ఏకం అయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్‌ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 9, 2024, 05:35 PM IST
Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?

TDP BJP Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది. శనివారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు ఎన్నికల్లో పోటీ, సీట్ల కేటాయింపుపై చర్చించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటికే పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. అందరూ ఒక అవగాహనకు వచ్చారని వెల్లడించారు. సీట్ల విషయంపై మూడు పార్టీలు కలిసి ప్రకటన విడుదల చేస్తాయని చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో కొన్ని బీజేపీ, జనసేనకు వెళ్తాయని.. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయాలని అనుకుంటున్నామన్నారు. పొత్తుల కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగినా చంద్రబాబు నాయుడు సర్ది చెబుతారని అన్నారు.

Also Read: TSRTC PRC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు  అదిరిపోయే న్యూస్.. పీఆర్సీ పెంపుపై ప్రకటన

వైసీపీ నేతలకు గెలుస్తామనే ధైర్య ఉంటే.. తమ పొత్తుల గురించి ఎందుకు కంగారు పడుతున్నారని కనకమేడల ప్రశ్నించారు. 24 గంటలూ చంద్రబాబు జపమే చేస్తున్నారని విమర్శించారు. ఇరవై ఏళ్ల కిందట చంద్రబాబు ఏదో అవినీతి చేశారంటూ ఇవాళ వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై 26 ఎంక్వైరీ కమిషన్‌లు వేసినా.. ఏదీ రుజువు కాలేదన్నారు. మూడు పార్టీల బలాబలాలు, గెలుపు ప్రాతిపాదికన సీట్ల షేరింగ్ ఉంటుందన్నారు. 

పొత్తుల విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పార్టీ ముఖ్య నేతలతో టెలీ నిర్వహించిన పొత్తు వారికి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు. ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడవద్దని.. సీనియర్లు ఇతర నేతలకు అవసరాన్ని వివరించాలని సూచించారు.

బీజేపీ డిమాండ్ చేస్తున్న 6 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజమండ్రి, నరసాపురం, అరకు, తిరుపతి, రాజంపేట, హిందూపురం స్థానాల్లో బీజేపీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని లోక్‌సభ నుంచి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించడంతో కాకినాడ లేదా మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేనకు సర్వేలో అనుకూలంగా రావడంతో అక్కడి నుంచే పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.  అనకాపల్లి  నుంచి సీఎం రమేష్‌, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్‌‌ కుమార్‌ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News