Air Connectivity: ఆంధ్రప్రదేశ్‌లో విమానయానం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా కారణంగా కుదేలైన విమాన సర్వీసులు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ఏపీలో ఏ విమానాశ్రయంలో ఎంత వృద్ధి నమోదైందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ప్రభావం దేశమంతా ప్రతిరంగంపై పడింది. ముఖ్యంగా విమానయానరంగంపై పెను ప్రభావమే పడింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం, పరిమితమైన సర్వీసులు, 50 శాతం ఆక్యుపెన్సీ షరతులు వంటివి ఆ రంగంపై కీలక ప్రభావం చూపించాయి. ఏపీలో ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా ఆ ప్రభావం పడింది. 


కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో విమానయానం తిరిగి కుదుటపడుతోంది. 2021 అక్టోబర్ నుంచి ఆంక్షలు లేకపోవడంతో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీలోని పలు విమానాశ్రయాలు కీలకమైన వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో 50 శాతం వృద్ధి నమోదైంది. 


రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలతో పాటు కర్నూలు, కడప విమానాశ్రయాలున్నాయి. 2020-21తో పోలిస్తే..2021-22లో సాగిన ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించి రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలైన తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలలో గణనీయమైన వృద్ధి నమోదైంది. తిరుపతిలో అత్యధికంగా 77 శాతం, విశాఖపట్నంలో 45 శాతం నమోదు కాగా, రాజమండ్రిలో 35 శాతం, విజయవాడలో 23 శాతం వృద్ధి నమోదైంది. విశాఖ నుంచి అత్యధికంగా 16.10 లక్షలమంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 


రాకపోకల్లోనే కాకుండా విమాన సర్వీసులు, కార్గో రవాణాలో కూడా ఏపీలో విమానాశ్రయాలు పుంజుకున్నాయి. సర్వీసుల పెరుగుదల తిరుపతిలో అత్యధికంగా 43 శాతం ఉంటే..విశాఖలో 28 శాతముంది. ఎక్కువ సర్వీసులు మాత్రం విశాఖపట్నం విమానాశ్రయంలో ఉన్నాయి. అటు డొమెస్టిక్, ఇటు ఇంటర్నేషనల్ సర్వీసులు విశాఖపట్నంలో 14, 852 విమానాలున్నాయి. కార్గో సర్వీసుల్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 13 శాతం ప్రగతి నమోదు చేసింది. 


Also read: Pawan Kalyan: దిగ్భ్రాంతికరం... సింగర్ కృష్ణకుమార్ కున్నత్ హఠాన్మరణం బాధ కలిగించింది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook