టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్
రాష్ట్రంలో ఖాళీగా వున్న నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.
అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా వున్న నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. దాదాపు కసరత్తు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో మంగళవారం చంద్రబాబు రాష్ట్ర పార్టీ కార్యాలయ ప్రతినిధులతో తన నివాసంలో లోతుగా చర్చించి 17 కార్పోరేషన్లకు ఛైర్మన్లను నియమించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రిపై మంత్రులతో సహా ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి తేవడంతో చంద్రబాబు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీఐడిసితో పాటు వైద్యసదుపాయాల కార్పోరేషన్, మహిళ ఆర్థిక సంస్థ, కాపు కార్పోరేషన్, బిసి ఆర్థిక సహకార సంస్థ, ఎస్.సి, హౌసింగ్ కార్పోరేషన్‌లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలకు ఛైర్మన్‌లను ఎట్టకేలకు నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఛైర్మన్లు వీరే..
* టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్
* ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌గా వర్ల రామయ్య
* ఆర్‌టీసీ విజయనగరం రీజియన్ ఛైర్మన్‌గా తెంటు లక్ష్మినాయుడు
* ఆర్‌టీసీ విజయవాడ రీ జియన్ ఛైర్మన్‌గా మెంటె పార్థసారధి
* ఆర్‌టీసీ నెల్లూరు రీజియన్ ఛైర్మన్‌గా ఆర్.వి. సుభాష్ చంద్రబోస్
* కడప ఆర్‌టీసీ రీజియన్ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి
* ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా దాసరి రాజారావు మాస్టర్
* శాప్ ఛైర్మన్‌గా పి.అంకమ చౌదరి
* ఏపీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
* ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా డాక్టర్ దివి శివరాం
* ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పో రేషన్ ఛైర్మన్‌గా ఎం.డి హిదాయతుల్లా
* ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్.ఎం. జుహాయిద్దీన్
* ఏపీ షీప్, గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా వై.నాగేశ్వర్ రావు యాద వ్
* ఏపీ మినిమం వేజెస్ బోర్డు ఛైర్మన్‌గా ఆర్. రాంమోహన్ రావు
* ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నామన రాంబాబు
* ఏపీ ఎస్.సి కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్ రావు
* ఏపీ కాపు వెల్ఫేర్ , డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు