Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి తీవ్రత..


Telangana Cold Wave: తెలంగాణను చలి వణికిస్తోంది.  చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

1 /6

Telangana Cold Wave: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో కనిష్ఠంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌- యూలో 6, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

2 /6

అటు నిర్మల్‌ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 8.3, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో 9.2, వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

3 /6

సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీచేశారు.

4 /6

నిరుటితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు.

5 /6

ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

6 /6

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.