AP Government increase registration Charges: జనవరి 1నుంచి  ఆంధ్ర ప్రదేశ్ లో లో  భూమి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్నాయి.  పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆధారంగా చార్జీలు   10 నుంచి 15 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయని సమాచారం. రిజిస్ట్రేషన్‌ విలువలతోపాటు, కన్ స్ట్రక్షన్‌  ఛార్జీలను సవరించనున్నారని తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు  ఈ నెల 20న సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పెరిగిన ఛార్జీలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శన చేస్తారు. వాటిపై ఈ నెల 24వ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుంది. పెరిగిన రిజిస్ట్రేషన్‌  ఛార్జీలు 2025 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.


మొత్తంగా ఏపీలో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయడానికి టాక్సులు కట్టే ప్రజలపై ఈ భారాన్ని మోపనుంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన సంక్షేమ  కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఉచిత బస్సు కార్యక్రమానికి వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్టు చెప్పింది. అంతేకాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మాత్రమే సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోంది. మొత్తంగా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో తాము చేసిన వాగ్ధానాలను అమలు చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమై ఉంది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.