ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్య నిషేధం వైపు ఒక్కో అడుగు వేస్తున్నారు. మద్యం ధరలను భారీగా పెంచుతూ అంచలంచలుగా మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఐతే కేంద్ర ప్రభుత్వం పరిమితంగా ఆంక్షలు సడలించి మద్యం షాపులు తెరుచుకునేందుకు వీలు కల్పించింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి.. మొన్నటి వరకు బంద్ చేసిన మద్యం షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతిచ్చారు. ఐతే లిక్కర్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే .. 25 శాతం ధరలు పెంచేశారు. ఐనప్పటికీ తొలి రోజు మద్యం కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున మద్యం కోసం డిమాండ్ పెరిగింది. 


ఈ క్రమంలో ఇవాళ మద్యం ధరలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. మద్యం ధరలను మరో 50 శాతం పెంచాలని నిర్ణయంతీసుకున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే మొత్తంగా మద్యం ధరలు 75 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం నుంచే అమలులోకి రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా ధరలు పెంచుతుండడంతో మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 


సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే 15  రోజుల్లో 15  శాతం మద్యం దుకాణాలను కూడా తగ్గించేందుకు ఆలోచిస్తోంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.