AP New Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటే..మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా నియంత్రణకై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 


ఇప్పటికే ఈ నెల 18 నుంచి నైట్ కర్ప్యూ(Night Curfew)అంటే రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది. వాస్తవానికి 13వ తేదీ నుంచే నైట్ కర్ప్యూ విధించినా..ఆ తరువాత సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని 18 వ తేదీకు వాయిదా వేసింది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరికొన్ని ఆంక్షలు విధించింది. ఆలయాల్లో భక్తులు తాకిడి అధికంగా ఉంటున్నందున..కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ ధరించని భక్తుల్ని(No Mas No Entry) ఆలయాల్లోకి అనుమతించవద్దని..సేవా టికెట్ల జారీని 50 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఆలయ క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. 


Also read: Kodi Pandalu: ఢీ అంటే ఢీ అన్న కోడి..ఈసారి పందేలు 450 కోట్ల పైమాటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి