AP Hall Tickets 2024: ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు రేపు విడుదల డౌన్‌లోడ్ లింక్ https://aptet.apcfss.in/ ఇదే
AP TET Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించి అప్పుడే పరీక్షకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపట్నించి టెట్ హాల్ టికెట్లు సైతం విడుదల కానున్నాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
AP TET Hall Tickets 2024: ఏపీ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ 2024తో పాటు టెట్ నోటీఫికేషన్ 2024 కూడా జారీ చేసింది. ఇప్పటికే టెట్ పరీక్ష 2024కు ఏర్పాట్లు పూర్తి కాగా ఈ నెల 27 నుంచి మార్చ్ 9 వరకూ టెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఏపీ టెట్ హాల్ టికెట్లు రేపట్నించి https://aptet.apcfss.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన టెట్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 18తో ముగిసింది. ఈ నెల 27 నుంచి మార్చ్ 9 వరకూ పరీక్షలు జరగనున్న తరుణంలో రేపట్నించి హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. టెట్ పరీక్ష 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో జరగనున్న డీఎస్సీలో టెట్ పరీక్షల్లో మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉండటంతో ఈ పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఎవరికి ఏ పరీక్ష, సిలబస్ వివరాలు
ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష 2024ను నాలుగు పేపర్లలో నిర్వహించనుంది. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకూ బోధించే టీచర్లకు పేపర్ 1ఎ ఉంటుంది. ఇక 1వ తరగతి నుంచి 5 వ తరగతి బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్ధులకు పేపర్ 1బి ఉంటుంది. ఇక 6 నుంచి 8వ తరగతి బోధించే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులకు పేపర్ 2ఏ ఉంటుంది. చివరిగా 6 నుంచి 8వ తరగతి బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్ధులకు పేపర్ 2బి ఉంటుంది.
ఏపీ టెట్ పరీక్ష 2024లో అన్ని పేపర్లు 150 మార్కులకు ఉంటాయి. ఆబ్జక్టివ్ విధానంలో జరిగే పరీక్షసు సమయం 2.30 గంటలు ఇస్తారు. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలో అభ్యర్ధులు తప్పనిసరిగా కనీ ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. ఒకసారి ఏపీ టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు..ఇక జీవితంలో ఎప్పుడైనా డీఎస్సీ రాయవచ్చు. అంతేకాకుండా టెట్‌లో వచ్చే మార్కులకు డీఎస్సీలో వెయిటేజ్ ఉంటుంది.
ఈ నెల 23 అంటే రేపట్నించి అభ్యర్ధులు టెట్ పరీక్షల హాల్ టికెట్లు https://aptet.apcfss.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 9 వరకూ రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. మార్చ్ 10వ తేదీన టెట్ పరీక్ష కీ విడుదల కానుంది. ఏమైనా అభ్యంతరాలుంటే మార్చ్ 11 వరకూ సమయం ఉంటుంది. ఇక ఫైనల్ కీ మార్చ్ 13న విడుదలవుతుంది. మార్చ్ 14న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook