AP IAS Transfers: ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ బదిలీలు, మరో 62 మందికి స్థానచలనం పూర్తి జాబితా ఇదే
AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటుతున్నా ఇంకా బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ప్రభుత్వం. కొన్ని ముఖ్యమైన శాఖలకు కమీషనర్లను మార్చింది. పూర్తి జాబితా ఇలా ఉంది.
AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరధ్ కుమార్ ప్రసాద్ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కీలక శాఖలకు కమీషనర్లను కూడా మార్చింది. ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ లభించింది. పూర్తి జాబితా మీ కోసం. ఈ జాబితాలో మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీ దత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎంవి శేషగిరి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ కమిషనర్‌గా రేఖా రాణి, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్ ఉన్నారు.
మల్లికార్జున్-బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ( ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు
ప్రసన్న వెంకటేశ్- సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శి
శ్రీ కేష్ బాలాజీ రావు- భూ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్
సీహెచ్ శ్రీత్-మైనార్టీ సంక్షేమ శాఖ
ఎంవి శేషగిరి-స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ
చేవూరి హరికిరణ్-ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
గిరీశ్ షా-పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ
నారపురెడ్డి మౌర్య-తిరుపతి మున్సిపల్ కమీషనర్
దినేశ్ కుమార్-గుంటూరు మున్సిపల్ కమీషనర్
ఎం వేణుగోపాల్ రెడ్డి-మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
నిశాంత్ కుమార్-ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్
సూరజ్ ధనుంజయ్-పల్నాడు జేసీ
జిసి కిషోర్ కుమార్-క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్ మిషన్ ఎండి
రామ సుందర్ రెడ్డి- ఆర్ అండ్ ఆర్ కమీషనర్
కీర్తి చేకూరి- ట్రాన్స్ కో జాయింట్ ఎండీ
విజయ సునీత-వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
సంపత్ కుమార్-విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్
ధ్యాన చంద్ర- విజయవాడ మున్సిపల్ కమీషనర్
కేతన్ గార్గ్-రాజమండ్రి మున్సిపల్ కమీషనర్
అమిలినేని భార్గవతేజ-గుంటూరు జిల్లా జేసీ
హిమాన్షు కోహ్లి-తూర్పు గోదావరి జిల్లా జేసీ
గోవిందరావు-కాకినాడ జిల్లా జేసీ
నిశాంతి-కోనసీమ జిల్లా జేసీ
ఎన్ తేజ్ భరత్-కడప మున్సిపల్ కమీషనర్
లక్ష్మీ షా-ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీ( ఎన్టీఆర్ వైద్య సేవ అదనపు బాధ్యతలు)
మంజీర్ జిలానీ-ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ ( శాఫ్ ఎండీగా అదనపు బాధ్యతలు)
రవి సుభాష్-ఎస్పీ పీడీసీఎల్ సీఎండీ
వీర పాండ్యన్-సెర్ప్ సీఈఓ
ఆదర్శ్ రాజేంద్రన్-అన్నమయ్య జిల్లా జేసీ
ఎం హరి నారాయణ-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
ఫర్మాన్ అహ్మద్ ఖాన్-శ్రీకాకుళం జిల్లా జేసీ
నూరుల్ కమల్-ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రటరీ
నిధి మీనా-ఎన్టీఆర్ జిల్లా జేసీ
శుభం బన్సల్-తిరుపతి జిల్లా జేసీ
సి విష్ణు చరణ్-నంద్యాల జిల్లా జేసీ
అదితి సింగ్- కడప జేసీ
పి ధాత్రి రెడ్డి-ఏలూరు జేసీ
అభిషేక్ గౌడ్-అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీ
ఎం కృష్ణ తేజ- పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్
సూర్య సాయి ప్రవీణ్ చంద్-సీఆర్ డీఏ అదనపు కమీషనర్
Also read: Flights Cancelled: ఏపీలో భారీ వర్షాలు, విశాఖలో 9 విమాన సర్వీసులు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook