Grama/Ward Sachivalayam Recruitment: అమరావతి: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అంతటా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పరీక్షలను ఇటీవల రద్దుచేసింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా ఆగస్టు రెండో వారంలో జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయం ( Recruitment ) పరీక్షలను కూడా వాయిదా వేసింది. Also read: AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది ఆదివారం ట్వీట్ చేసి పరీక్షలపై సమాచారమిచ్చారు. మళ్లీ గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో మళ్లీ వెళ్లడిస్తామని ట్వీట్ చేసి వెల్లడించారు. 


GS/VS Exam. in A.P. - It is to inform all concerned that due to COVID-19, GS/VS Recruitment Exams. are NOT being conducted in 2nd week of August 2020 as announced earlier. Fresh dates/schedule will be announced in due course.



గ్రామ, వార్డు సచివాలయాల్లో 15,000 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్‌ను జనవరిలో విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను ఆగస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా పరీక్షలను వాయిదా వేసింది. Also read: Andhra Pradesh: ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కరోనా కేసులు