Botsa Electricity bills Issue: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటికి ఆయన కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే పవర్‌ కట్‌ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ డిస్కం సీఎండీతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా మాట్లాడారు. అక్కడ విద్యుత్ సరఫరా సరిగా లేదని..రోడ్లు సైతం ఆధ్వానంగా ఉన్నాయని వ్యాఖ్యనిచ్చారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చినా..కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 


హైదరాబాద్‌లో కూడా విద్యుత్ కోతలున్నాయని గుర్తు చేశారు. అక్కడ తన ఇంట్లో జనరేటర్లు వేసుకున్న సందర్భాలున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతలు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో కరెంట్ బిల్లు కట్టలేదేమో ..అందుకే కట్‌ చేశారని విమర్శించారు. అక్కడితో ఈ వివాదం ముగిసిందనుకున్న సమయంలో ఒక్కసారి ఓ పోస్ట్ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. 


హైదరాబాద్‌లోని తన నివాసానికి మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ కట్టలేదని..15 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉందన్న పోస్ట్ ..సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై పెను దుమారం రేగింది. నెటిజన్లు సైతం కామెంట్లు పెట్టారు. ఈ ట్వీట్‌పై తెలంగాణ డిస్కం సీఎండీ రఘుమా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  


మంత్రి బొత్సకు సంబంధించిన ట్వీట్ బోగస్‌ అని స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ ట్వీట్ చేయలేదని తేల్చి చెప్పారు. తమ సంస్థ పేరుపై తప్పుడు సమాచారాన్ని రూపొందించారన్నారు. దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ట్వీట్ ఎవరు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు డిస్కం సీఎండీ రఘుమారెడ్డి.


Also read:Sammathame Teaser: ప్రేమ పడదంటూనే ప్రేమలో పడిన హీరో కిరణ్.. 'సమ్మతమే' టీజర్‌ అదుర్స్..


Also read:Coconut Milk Tea Benefits: కొబ్బరి పాల టీ ఎప్పుడైనా తాగారా? దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.