Kodali Nani: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద ఎత్తన కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్​ పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలని నానికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్​లోని (Kodali Nani Tested Corona Positive) ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొడాలి నాని ఆరోగ్యం పట్ల ప్రస్తుతానికి ఏ ఆందోళన అవసరం లేదని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.


మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధా కూడా కరోనా బారిన (Vangaveeti Radha tested Corona Positive) పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్​ ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.


కరోనా సోకిన రాజకీయ నాయకులు వీరే..


ఇటీవలి కాలంలో పలువురు రాజకీయనాయకులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కరోనా బారిన (Corona infected politicians) పడ్డారు.


కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీకి కూడా తాజాగా కొవిడ్ పాజిటివ్​గా (Nitin Gadkari tested Corona Positive) తేలింది.


బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సహా పలువురికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది.


ఇందులో కొంత మందికి కొవిడ్ సోకడం రెండవ సారి కావడం గమనార్హం. కరోనా సోకినప్పటికీ చాలా మంది ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు (Corona infected Chief Ministers) స్వయంగా ప్రకటించారు.


Also read: విషాదం... కెనాల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు మృతి


Also read: No illegal mining : అక్కడ ఎలాంటి మైనింగ్ జరగట్లేదు.. అదంతా అప్పుడు జరిగిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook