విషాదం... కెనాల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు మృతి

MLA Pinnelli Ramakrishna Reddy's brother car plunges into canal: కారు కాలువలో పడిన వెంటనే మదన్‌మోహన్ రెడ్డి అందులో నుంచి బయటపడగలిగారు. నీళ్లలో ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. కెనాల్‌లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు చాలా దూరం కొట్టుకెళ్లింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 09:37 AM IST
  • గుంటూరు జిల్లాలో విషాదం
  • సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే సోదరుడి కారు
  • ప్రమాదంలో ఇద్దరు మృతి
  • ప్రాణాలతో బయటపడ్డ ఎమ్మెల్యే సోదరుడు
 విషాదం... కెనాల్‌లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు మృతి

MLA Pinnelli Ramakrishna Reddy's brother car plunges into canal: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువుల కారు సాగర్ కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాద విషయం తెలిసి ఎమ్మెల్యే పిన్నెల్లి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహన్ రెడ్డి తన భార్య లావణ్య, కూతురు సుదీక్షతో కలిసి సంక్రాంతి షాపింగ్ నిమిత్తం మంగళవారం (జనవరి 11) విజయవాడ వెళ్లారు. షాపింగ్ ముగించుకుని తిరిగొస్తున్న క్రమంలో దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో కారు అదుపు తప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను సైడ్ చేసే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.

కారు కాలువలో పడిన వెంటనే మదన్‌మోహన్ రెడ్డి అందులో నుంచి బయటపడగలిగారు. నీళ్లలో ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. కెనాల్‌లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు చాలా దూరం కొట్టుకెళ్లింది. ప్రమాద (Road Accident) సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొట్టుకుపోయిన కారును గుర్తించి భారీ క్రేన్ సహాయంతో దాన్ని బయటకు తీశారు. అందులో లావణ్య, సుదీక్ష మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Horoscope 2022 January 12: ఈ రాశి వారికి గడ్డు కాలం నడుస్తోంది జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News