Kottu Satyanarayana: రాష్ట్రవ్యాప్తంగా 8 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్ల దేవాలయాల్లో ఆన్‌లైన్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 20 నుంచి ఆన్‌లైన్ సౌకర్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో పది దేవాలయాల్లో ఆన్‌లైన్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నామన్నారు. పదోన్నతులపై కసరత్తులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ముగ్గురికి డీసీలుగా పదోన్నతులు ఇచ్చామని స్పష్టం చేశారు. అక్టోబర్ పదిన ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తామన్నారు.


ట్రిబ్యునల్‌లో పెండింగ్‌ ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. తొమ్మిది స్టాండింగ్ కౌన్సిల్ లను త్వరలోనే నియమించనున్నామన్నారు. ప్రతి మంగళవారం దేవాదాయ శాఖపై సమీక్షిస్తున్నామని తేల్చి చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.


ఉచిత దర్శనాలు, రూ.300 దర్శనాలకు వచ్చే భక్తులను ఘాట్ రోడ్డు ద్వారా అనుమతిస్తామన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కల్గకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్‌ కేటాయించామని పేర్కొన్నారు. రోజుకు ఆరు దఫాలుగా వీఐపీ దర్శనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. రెండు గంటల స్లాట్‌లతో రెండు వేల చొప్పున వీఐపీ టికెట్లు ఇవ్వనున్నామని తెలిపారు.


దుర్గమ్మ దర్శనం కోసం రూ.500, రూ.600, రూ.1400 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సామాన్య భక్తులకు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదన్నారు.


సిఫార్సు లేఖ ద్వారా ఆరుగురికి మాత్రమే రూ.500 టికెట్ దర్శన అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వీఐపీల కంటే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. మూలా నక్షత్రం రోజున భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉందని..అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దసరా మహోత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీని నియమిస్తున్నామన్నారు.


Also read:BJP: స్పీడ్ పెంచిన కమలనాథులు.. ఆ 144 లోక్‌సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్..!


Also read:Asia Cup 2022: ఈసారి ఆసియా కప్ వారిదే..భారత మాజీ స్టార్ ప్లేయర్ జోస్యం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి