BJP: స్పీడ్ పెంచిన కమలనాథులు.. ఆ 144 లోక్‌సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్..!

BJP: దేశంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా లోక్ సభ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 6, 2022, 05:22 PM IST
  • దూకుడు పెంచిన బీజేపీ
  • మళ్లీ పవర్‌లోకి వచ్చేందుకు పావులు
  • మంతనాలు జరపనున్న నేతలు
BJP: స్పీడ్ పెంచిన కమలనాథులు.. ఆ 144 లోక్‌సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్..!

BJP: 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకెళ్తోంది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లోని 144 ఎంపీ స్థానాలపై ఫోకస్ చేసింది. ఆయా ప్రాంతాల్లో పాగా వేసేందుకు స్కెచ్‌లు వేస్తోంది. గతంలోఎన్నడూలేనివిధంగా కేవలం లోక్‌సభ స్థానాలపై ఫోకస్ చేసింది. ఆ స్థానాల్లో పక్కగా విజయం సాధించేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ తయారు చేస్తోంది. ఇందులోభాగంగా ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది.

భేటీలో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించనున్నారు. గెలుపు గుర్రాల అన్వేషణపై కూడా మంతనాలు జరపనున్నారు. భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర సింగ్ తోమర్, అనురాగ్ ఠాకూర్, మన్ సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

ఈసందర్భంగా పార్టీ నేతలకు జేపీ నడ్డా, అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి పవర్‌లోకి రావాలని యోచిస్తోంది. ఈనేపథ్యంలో గత ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో గెలిచి లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఎన్నడూ గెలవని స్థానాలను ఎంపిక చేశారు. ఇలా మొత్తం 144 స్థానాలపై టార్గెట్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది.

ప్రధానంగా పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలపై ప్రత్యేక రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై అంచనా వేసేందుకు మంత్రుల బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్నాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల బృందం..వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వీటితోపాటు అభ్యర్థులపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రుల బృందం అందించిన అభ్యర్థులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి పరిస్థితులను అంచనా వేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న భేటీలో దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also read:Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్యప్రచారం దేనికీ..బీజేపీపై మంత్రి హరీష్‌ ఫైర్

Also read:Asia Cup 2022: అన్ని వదిలిపెట్టు..దేశం కోసం ఆడు..అర్ష్‌దీప్‌కు మహమ్మద్ షమీ సలహా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News