Chandrababu Cabinet: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సహా 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమిలోని రెండు మిత్రపక్షాల్లో నలుగురికి కేబినెట్‌లో స్థానమిచ్చారు. ఈసారి అనూహ్యంగా బీసీలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్ధమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్ యాదవ్, సవితలు బీసీ సామాజిక ర్గానికి చెందినవారు. ఇక కమ్మ సామాజికవర్గం నుంచి నలుగురికి నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్‌లకు స్థానం లభించింది. కాపు సామాజికవర్గం నుంచి నలుగురు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయడులకు చోటు దొరికింది. రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురు ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ జనార్ధనరెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డిలకు అవకాశం దొరికింది. ఇక ఎస్సీ కోటాలో అనిత, డోలా బాల వీరాంజనేయస్వామిలకు మంత్రివర్గంలో చోటు లభిస్తే ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం మైనారిటీ నుంచి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య నుంచి టీజీ భరత్‌లకు స్థానం లభించింది. 


చంద్రబాబు మంత్రివర్గం కూర్పు చూస్తుంటే..ప్రతి ఏడెనిమిది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించినట్టు అర్ధమౌతోంది. జనసేన 21 స్థానాలు గెలిస్తే 3 మంత్రి పదవులు, బీజేపీ 8 గెలిస్తే 1 మంత్రి పదవి దక్కించుకుంది. ఇక 136 స్థానాలు గెలిచిన తెలుగుదేశంకు 21 మంత్రిపదవులు కేటాయింపు జరిగింది. ఉమ్మడి జిల్లాలవారీగా పరిశీలిస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్నించి ముగ్గురు చొప్పున మంత్రి పదవులు దక్కించుకోగా, తూర్పు పశ్చిమ, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి పదవులు లభించాయి. ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్నించి ఒక్కొక్కరికి అవకాశం వచ్చింది. 


సీనియర్లకు మొండిచేయి


యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూలిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, కూన రవికుమార్, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కొణతాల రామకృష్ణ వంటి సీనియర్లకు తీవ్ర నిరాశే మిగిలింది.


Also read: Chandrababu Cabinet: 25 మందితో చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే, సీనియర్లకు మొండిచేయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook