Nara Lokesh: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ పేరు గత కొద్దికాలంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు మంత్రిగా మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా లోకేశ్ ఉండాలంటూ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుుడు తాజాగా నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టేనని అర్ధం అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీకు మరో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. టీడీపీ నేతలు బహిరంగంగా డిమాండ్ చేయడం వెనుక చంద్రబాబు హస్తముందనే వాదన కూడా లేకపోలేదు. నిజానిజాలు ఎలా ఉన్నా లోకేశ్ ఉప ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ ప్రచారంపై నారా లోకేశ్ ఇచ్చిన సమాధానమే ఇందుకు కారణం. సీఎం అవుతారా లేక డిప్యూటీ సీఎం అవుతారా అంటూ పశ్నించిన మీడియాకు నారా లోకేశ్ ఇచ్చిన సమాధానం పరోక్షంగా అవుననే సంకేతాలనిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎ పదవి ఇచ్చినా స్వీకరించి అహర్నిశలు కష్టపడతానని, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఒక వ్యక్తి ఒకే పదవిలో మూడు సార్లు ఉండకూడదన్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శిగా రెండు సార్లు ఉన్నానని, ఇక మూడోసారి ఉండకూడదనుకుంటున్నానన్నారు. 


నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలకు చాలా అర్ధాలు కన్పిస్తున్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి పదవి మూడోసారి వద్దని చెప్పడం ద్వారా సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అంతే కాకుండా సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవులు తనకు వద్దని ఖండించలేదు. ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.అదే సమయంలో డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా అనే మాట లోకేశ్ నుంచి రాకపోవడం గమనార్హం. 


అంటే తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ఆ పదవికి తాను సిద్ధమేనని సంకేతాలిచ్చారనే వాదన విన్పిస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టేందుకే నారా లోకేశ్ పేరు తెరపైకి వచ్చిందనే వాదనకు బలం చేకూరుతుంది. అందుకే ఈ అంశం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది. 


Also read: 8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల, 44.44 శాతం పెరగనున్న కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి