Janasena-Telugudesam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిగా ఎన్నికలకు సిద్ధమౌతోంది. అందుకే ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తెలుగుదేశం-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మరో వారం రోజుల్లో బీజేపీ కూటమిలో ఉంటుందా లేదా అనేది స్పష్టత వస్తుంది. ఈలోగా జనసేన-తెలుగుదేశం పార్టీ అధినేతలు సీట్లపై పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఊహించినట్టే జనసేనకు కేవలం 23-25 అసెంబ్లీ సీట్లు,మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తున్నట్టు సమాచారం. జనసేన అంతకంటే ఎక్కువ సీట్లు ఆశించినా తెలుగుదేశం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి దాదాపుగా అంగీకరించారని సమాచారం. ఈ క్రమంలో జనసేనకు తెలుగుదేశం కేటాయించే సీట్లు ఏంటో తెలుసుకుందాం.


జనసేనకు కేటాయించనున్న సీట్లు ఇవేనా


తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ ఉత్తరం లేదా దక్షిణం, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, పి గన్నవరం, రాజానగరం, రాజమండ్రి రూరల్, అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, రాజంపేట, తిరుపతి లేదా చిత్తూరు, అనంతపురం, ఆళ్లగడ్డ.


ఇక పార్లమెంట్ స్థానాల్లో కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి జనసేనకు కేటాయించనుంది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి జనసేన 40 సీట్ల వరకూ ఆశించినా 30 సీట్లు అయినా దక్కుతాయని భావించింది. ఎందుకంటే జనసేన కార్యకర్తలు, అభిమానుల్నించి ఈ విషయంపై ఒత్తిడి అధికంగా ఉంది. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం 23-25 సీట్లే ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. బీజేపీ నుంచి స్పష్టత వచ్చాక రెండు పార్టీల ఉమ్మడి జాబితా  వెలువడవచ్చు. 


బీజేపీ ఒకవేళ కూటమిలో చేరితో ఆ పార్టీకు కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 7-10 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు కోరవచ్చని తెలుస్తోంది. 


Also read: Valentine Week: వాలెంటైన్ వీక్ కు ముందు ఘోరం.. ప్రియుడి చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకున్న యువతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook