AP Politics: బీజేపీతో పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీల్లో ఎవరికెన్ని సీట్లు
AP Politics: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు విషయమే ఇంకా కొలిక్కి రావడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. తెలుగుదేశం-జనసేన పార్టీలు ఇప్పటికే కూటమిగా ఉండగా ఇప్పుడు బీజేపీతో జత కట్టనున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయినా సీట్ల సర్దుబాటు విషయమే ఇంకా తేలలేదు. ఈ నెలాఖరుకు ఎవరికెన్ని సీట్లనేది క్లారిటీ రావచ్చు
ఏపీలో 2014 పొత్తులు రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. అయితే నాటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా బీజేపీ-తెలుగుదేశం కూటమికి మద్దతిచ్చింది. ఈసారి జనసేన కూడా బరిలో ఉండటంతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రావడం లేదు. జనసేన కనీసం 25-30 అసెంబ్లీ స్థానాలు, 2-3 ఎంపీ స్థానాలు కోరుకుంటోంది. ఇక బీజేపీ 10-12 అసెంబ్లీ స్థానాలు, 3-4 ఎంపీ స్థానాలు ఆశిస్తోంది. అంటే బీజేపీ-జనసేన పార్టీలకు కలిపి 35-45 అసెంబ్లీ స్థానాలు, 5-7 ఎంపీ స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. మిగిలిన స్థానాలు తెలుగుదేశం సరిపెట్టుకోవల్సి వస్తుంది. అయితే బీజేపీ చేసిన మరో ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది. జనసేన-బీజేపీ కలిపి 75 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాయని మిగిలిన 100 సీట్లు తెలుగుదేశం తీసుకోవాలనేది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. దీనిపై స్పష్టత లేకపోయినా జనసేన తరపున కూడా బీజేపీ సీట్లు అడుగుతోందని తెలుస్తోంది.
బీజేపీతో పొత్తు ఖాయమేనని కానీ గతంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో ఆ పార్టీ ఎక్కువ సమయం తీసుకుంటోందని ఓ తెలుగుదేశం నేత వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీ నుంచి ఎక్కువ స్థానాలు ఆశిస్తోందని తెలుస్తోంది. అటు టీడీపీ కూడా సీట్ల విషయంలో బీజేపీతో పేచీ పెట్టుకోకపోవచ్చని సమాచారం. దాదాపుగా అడిగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే 2014లో ఇదే కూటమితో ఆ ఎన్నికల్లో లబ్ది పొందిన సంగతిని తెలుగుదేశం నేతలు గుర్తు చేసుకుంటున్నారు. 2019లో అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేసి విఫలమయ్యాయని విశ్లేషిస్తున్నారు.
Also read: SV Medical College: ఎస్‌వీ మెడికల్ కాలేజీలో కండోమ్ ప్యాకెట్లు.. తుప్పల్లో దిమ్మతిరిగే విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook