AP Assembly Elections 2024: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. టీడీపీ-జనసేన కూటమి సీట్ల పంపంకం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఈ కూటమితో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉండడంతో ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. పొత్తు ఒకే అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి..? ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి..? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila Security: చెల్లెమ్మకు భద్రత పెంచిన జగన్‌ అన్నయ్య.. 2+2 భద్రత పెంపు


మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమవ్వడంతో ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీ చివరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి ప్రధాన మంత్రితో భేటీ అవ్వబోతున్న నేపథ్యంలో పొత్తుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 


ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపేందుకు వెళ్లనున్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు నిన్న ఢిల్లీలోని బీజేపీ నేతలతో  చర్చలు జరిపి ఇవాళ ఏపీకి చేరుకున్నారు.. ఆ నేపథ్యంలోనే బీజేపీ పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీకి పిలిచిందని సమాచారం. టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ క్లారిటీ ప్రకటించినప్పటికి, బీజేపీతో పొత్తు తర్వాత కేటాయించిన సీట్లలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఢిల్లీ మీటింగు తర్వాత తెలువనుంది.


ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏపీ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టడంతో ఏపీ రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుకు సిద్ధం అంటే.. ఇన్నాళ్లు వైసీపీతో సఖ్యతతో ఉన్నటువంటి బీజేపీ ఏపీలో తన ఉనికిని కోల్పోయే అవకాశం లేకపోలేదు. గత ఐదేళ్లుగా  వైసీపీతో మైత్రి కొనసాగిస్తున్న బీజేపీ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకోనుందోనని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter