RK U Turn: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు మారుతున్నాయి. టికెట్ విషయంలో అలిగి పార్టీకు దూరమై కాంగ్రెస్ కండువా కప్పుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌తో భేటీ కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. మంగళగిరి టికెట్ విషయంలో అసంతృప్తికి గురైన ఆర్కే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇటీవల కొద్దిరోజులుగా ఆయన మౌనంగా ఉన్నారు. తిరిగి సొంతగూటికి చేరవచ్చనే వార్తలు వస్తున్నాయి. నిన్న అంటే సోమవారం రాత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు చేశారు. ఈ చర్చలు దాదాపుగా ఫలించాయని తెలుస్తోంది. ఆర్కే మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. 


తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు. సీఎంవో కార్యాలయం నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జారీ అయింది. ఆయన సన్నిహితులు, స్నేహితుల సూచనలు ఓవైపు, వైసీపీ పెద్దల మంతనాలతో ఆర్కే సొంతగూటికి చేరే నిర్ణయం తీసుకున్నారు. 


2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి స్వల్ప తేడాతో గెలిచిన ఆర్కే 2019లో నారా లోకేశ్‌ను ఓడించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న తరుణంలో వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. గంజి చిరంజీవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురై పార్టీ వీడారు. అప్పటికే ఆయనలో రెండుసార్లు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. ఇప్పుుడు వైసీపీ పెద్దలు ఆయనను పార్టీలో రప్పించేందుకు పావులు కదిపారు. ఆర్కే పార్టీలో చేరితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. మరి కాస్సేపట్లో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తరువాత పార్టీ కండువా కప్పుకోనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యత కూడా ఆర్కేకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. 


Also read: RBI Regional Office: అమరావతికి నో, విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైన ఆర్బీఐ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook