AP Poll Percentage 2024: ఉద్రిక్తతలు, దాడుల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AP Poll Percentage 2024: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. 6 గంటల తరువాత కూడా క్యూలైన్ల ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదు కాగా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Poll Percentage 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4-5 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 169 నియోజకవర్గాల్లో 6 గంటలకు ముగిసింది. 6 గంటల తరువాత కూడా భారీగా క్యూలైన్లలో ఉండటంతో పోలింగ్ శాతం ఎంతనేది రేపటికి స్పష్టత రావచ్చు.
ఏపీలో సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా చూస్తే గత ఏడాది 2019లో నమోదైనట్టే 78-79 శాతం నమోదు కావచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అభ్యర్ధుల భవితవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 1 లక్షా 6 వేలమంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఆరకు , పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిస్తే పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. ఎన్నడూ లేనిది ఈసారి ఉదయం 7 గంటలకే క్యూలైన్లలో జనం బారులు తీరి కన్పించారు. ఎండల ధాటికి తట్టుకోలేక ఉదయమే జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, తెలుగుదేశం నేతలు కొట్టుకోవడం, రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలు జరిగాయి. తాడిపత్రిలో అయితే ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్ల దాడి జరిగింది. పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల తెలుగుదేశం ఏజెంట్లను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు తెలుగుదేశం ఏజెంట్లను కిడ్నాప్ చేసినట్టు తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
హిందూపురంలో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా, 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తిరుపతి, గుంటూరు పశ్చిమం, మాచర్ల, గన్నవరం, గూడూరు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Also read: AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook