APPSC Recruitment 2021: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. ఏపీపీఎస్సీ(APPSC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా ఆయుష్ శాఖ(Department of AYUSH)లో మెుత్తం 151 ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఈ రిక్రూట్ మెంట్(APPSC Recruitment 2021) ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఏపీపీఎస్సీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు(Apply) చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ తర్వాత ప్రకటిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.


Also Read:SBI PO JOBS Notification 2021: ఎస్బీఐలో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల


పోస్టుల వివరాలు, అర్హతలు
మొత్తం ఖాళీలు- 151
విద్యార్హతలు: మెడికల్ ఆఫీసర్ (యునానీ) యునానీలో డిగ్రీ పాస్ కావాలి.
దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.250 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.120 ఎగ్జామ్ ఫీజు మినహాయింపు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్


అప్లై చేయండిలా..
* మెడికల్ ఆఫీసర్ (యునానీ) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
* అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
* యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
* ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
*యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
*పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
*అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook