AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,570 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 30,022 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం.


క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల భారీగా తగ్గాయి. అయినప్పటికీ కేసులు మాత్రం 4500పైనే నమదవడం గమార్హం.


ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. చిత్తూరు జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,510 మంది కొవిడ్​కు బలయ్యారు.


ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 669 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,65,000 మంది కరోనాను జయించారు.



ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,770 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.


జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..


చిత్తురులో అత్యధికంగా 6,080 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత విశాఖపట్నంలో 5,619 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, ప్రకాశం.. మినహా మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికిపైనే యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.


ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,18,62,032 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,102,280  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.


మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


Also read: Ambati Rambabu: మూడోసారి కరోనా బారినపడ్డ వైకాపా ఎమ్మెల్యే


Also read: Nandamuri Balakrishna: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook